calender_icon.png 27 December, 2024 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

26-12-2024 03:21:39 AM

పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి

ఖమ్మం/నల్లగొండ, డిసెంబర్ 25 (విజయక్రాంతి): క్రిస్మస్ వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. క్రైస్తవులు ఆనందోత్సహాలతో పండుగను జరుపుకున్నారు. చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా బయ్యారం ఆర్‌సిఎం చర్చిలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గంలోనే తమ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని ఆయన అన్నారు.

అనంతరం భట్టిని క్రైస్తవులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, హస్త కళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యానారాయణ, రంగా హన్మంతరావు, మిర్యాల వెంకటరమణగుప్తా   పాల్గొన్నారు. ఖమ్మంలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్లు, బిషప్ మంత్రికి ఆశీర్వచనాలు అలందించారు.

క్రిస్టియన్ మైనార్టీల సర్వతోము ఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ నీరజ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ  రోడ్డులోని సెయింట్‌నరీ బిషప్ చర్చి, క్లాక్ టవర్ వద్ద ఉన్న చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్టి వెంకట్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.