calender_icon.png 24 December, 2024 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యం కలెక్టరేట్ లో క్రిస్మస్ వేడుకలు

23-12-2024 10:23:22 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ వేడుకల్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, టీఎన్జీఓ ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.