calender_icon.png 26 December, 2024 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్ఐలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

25-12-2024 07:57:33 PM

నిజాంబాద్,(విజయక్రాంతి): యేసు ప్రభువు బోధనలు ఆయన చూపిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనమనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ ఆచరణీయమని సీఎస్ఐ చర్చ్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సి ఎస్ ఐ చర్చి ఆవరణలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలను చేశారు. పరస్పరం కలుసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

భక్తి శ్రద్ధలతో యేసుప్రభు బోధనలను పాదర్లు బోధించరు

ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ మాట్లాడుతూ.. యేసు క్రీస్తు పుట్టిన రోజును ప్రపంచ ప్రజలు జరుపుకునే ప్రత్యేకమైన పండుగని, యేసు క్రీస్తు పుట్టిన రోజు ప్రజలందరికీ సంతోషం కలగజేసే ప్రపంచ పండగ అన్నారు. యేసు క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఆయన బోధలు మానవాళి మనలను పునరుద్ధరించేవని తెలిపారు. మానవ విలువలు నేర్చిన ఆయన బోధనలు అనుసరిస్తే మనిషి ని మనిషిగా ప్రేమించే గుణం అలవాటు పడుతుందన్నారు. 

మానవతా విలువలు నేర్చిన మహనీయుడని ఆయనను కీర్తనలు పాడి కొనియాడారు. నుడా చైర్మన్ కేశవేణు క్రిస్మస్ వేడుకల సందర్భంగా మొదటి ప్రార్థన సమయానికి హాజరయ్యారు. కేశవ వేణు ఈ సందర్భంగా మాట్లాడుతూ... సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ భావాన్ని, సేవా, క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినం క్రైస్తవులకు పవిత్ర దినంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంతోషక రంగా నిర్వహిం చుకునే పండుగ క్రిస్మస్ అని తెలియజేశారు. 

యేసుక్రీస్తు సూచించిన మంచి మార్గంలో ప్రజలు నడవాలని సుఖ సంతోషాలతో జీవించాలని కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా  సోదరుడిగా  అండగా ఉంటానని అన్నారు. అందుకే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బోధ చేశారు. అనంతరం సి ఎస్ ఐ చర్చి పాస్టర్లు, చర్చి కమిటీ సభ్యులు, నుడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రత్నాకర్ లు కలిసి చర్చ్ ఆవరణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.