నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదు
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా ఆదేశం
వరంగల్, మే 17 (విజయక్రాంతి): వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను గడువులోగా పూర్తి చేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్‌చొంగ్తూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎంజీఎంలోని పలు విభాగాలు, కేఎంసీలోని పీఎంఎస్‌ఎస్ ఆసుపత్రి విభాగాలను సందర్శించారు. ఎంజిఎంలోని క్యాజువాలిటీ, పీడియాట్రిక్ విభాగాలు, క్యాథ్ ల్యాబ్, డయాలిసిస్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రిస్టియానా మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నదని తెలిపారు. దవాఖాన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ నాగేంద్ర, ఈఈ జితేందర్‌రెడ్డి, టిఎస్‌ఎంఐడిసి ఎస్‌ఈ దేవేందర్‌లతోపాటు ఆయా హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నిర్మల, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ గిరిధర్, సీకేఎం కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాస్, డాక్టర్ రాంకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.