17-04-2025 05:34:01 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో గుడ్ ఫ్రైడే పండుగ(Good Friday festival) పురస్కరించుకొని క్రైస్తవులు శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేఏంపీఎఫ్ మండల అధ్యక్షులు మునిగె జోసెఫ్ సురేష్, కేఎంసివైఎఫ్ అధ్యక్షులు వెంకట్ కన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళీ, వివిధ పార్టీల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్, నీలం దుర్గేశ్, బిర్రు వెంకన్న, పురం రాజమని రమేష్, జాతోత్ హరీష్ నాయక్, వల్లందాస్ రవి, కొమ్ము నాగరాజు, గొడిశాల వెంకన్న, శంకర్, చాగంటి కిషన్ పాస్టర్లు మల్లెపాక తిమోతి, పిల్లి కుమార స్వామి, ఆశీర్వాదం, ప్రభుజీవన్, థామస్ రెడ్డి, రూబెన్ పాల్, మహేందర్, సుధాకర్, ఫిలిప్, పేతురు, ఇశ్రాయేలు, కశ్మీనాధ్, రవి కుమార్, జాన్ వెస్లీ, జాన్ మెహబూబ్, శ్రీధర్, పీటర్ సింగ్, లాజరస్ గౌడ్, కర్నాకర్, విల్సన్, పృథ్విరాజ్, బనిషెట్టి వెంకటేష్, జన్ను మహేందర్, తిప్పర్తి శ్రీధర్, కర్నాకర్ పాల్గొన్నారు.