మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, డిసెంబర్ 23: ఏడాది పాలన పూర్తిచేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే నాలుగేండ్లలో మరిన్ని పనులు చేసేలా క్రైస్తవులు ఆశీర్వదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లో క్రిష్టియన్ భవనాన్ని నిర్మిస్తామన్నారు.
ఇందుకోసం స్థలాన్ని పరిశీలించాలని ఆర్డీవోను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్ అనిత పాల్గొన్నారు. అనంతరం దివంగత మాజీ పీఎం పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగర వెళ్తూ హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌ను మంత్రి తనిఖీ చేశారు.