19-04-2025 02:06:33 AM
మఠంపల్లి, ఏప్రిల్ 18: దైవ కుమారుడైన ఏసు క్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి శిలువపై తన రక్తాన్ని చిందించి,మనుషుల పాపాలనూ,దోషాలనూ ప్రక్షాళన చేశాడనీ,సర్వ లోకానికీ సార్వకాలికమైన శాంతి,క్షమల సందేశాన్ని తన త్యాగంతో క్రీస్తు చాటి చెప్పారని,విచారణ గురువు ఫాదర్ మార్టిన్ పసలా తెలిపారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని మఠంపల్లి మండల కేంద్రములోని సుభావార్త దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫాదర్ మార్టిన్ ర్టిన్ పసల గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. దేవుడు తాను సృష్టించిన సకల జీవరాశుల్లో వివేకాన్నీ, జ్ఞానాన్నీ ఒక్క మానవుడికే ఇచ్చాడనీ, భూలోక రాజ్యంపై మనుషులకు ఆధిపత్యాన్ని ఇచ్చాడనీ అన్నారు. దేవుని ఆదేశాల ప్రకారం శాంతి సామరస్యాలతో, సహోదరభావంతో జీవించాల్సిన మానవులు దురాశతో, వ్యామోహాలతో పాప కార్యాలలో మునిగిపోయారనీ తెలిపారు.
భూమిని అశాంతిపాలు చేశారనీ,పతనమైపోతున్న మానవులకు మంచి మార్గాన్ని చూపించడానికి ఏసు క్రీస్తు తన ప్రవర్తనతో, ప్రబోధాలతో మానవాళికి దిశా నిర్దేశం చేశాడనీ అన్నారు.తదనంతరం అందరికీ దివ్య సప్ర సాదాన్ని అందించారు.క్రీస్తు మరణానికి చిహ్నంగా సిలువపై తెల్లటి వస్త్రాన్ని ఉంచారు.ఈ కార్యక్రమంలో క్యాథలిక్ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.