calender_icon.png 29 March, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిహెచ్పీ కార్మికులపై వివక్షను వీడాలి

26-03-2025 05:04:09 PM

మందమర్రి (విజయక్రాంతి): ఓపెన్ కాస్ట్ గనుల్లోని సీహెచ్పీలలో పనిచేస్తున్న కార్మికులకు వేసవిని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న యాజమాన్యం ఏరియా సిహెచ్పీలలో పనిచేస్తున్న కార్మికులకు పంపిణీ చేయకుండా వివక్షను ప్రదర్శించడం సరైనది కాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు సింగరేణి యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. బుదవారం ఏరియాలోని ఆర్కేపి సీహెచ్పీలో పని స్థలాలను పరిశీలించి కార్మికులను కలిసి మాట్లాడారు. సిహెచ్పిలో పనిచేస్తున్న కార్మికులకు వేసవికాలంలో ఎండలు ముదురుతున్నందున వేసవి ఉపశమన చర్యలు చేపట్టి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని, దుమ్ము నివారణ చర్యల్లో భాగంగా డస్ట్ మాస్కులు ఇవ్వాలని వారు కోరారు.

ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికులకు పంపిణీ చేసిన విధంగానే ఏరియా సిహెచ్ పిల్లో పనిచేస్తున్న కార్మికులకు, అవుట్ డోర్ లో పని చేస్తున్న సివిల్, వర్క్ షాప్, సెక్యూరిటీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా గుర్తింపు సంఘం యజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని వారు సూచించారు. గుర్తింపు సంఘం అలసత్వం వల్ల సెప్టెంబర్లో ఇవ్వగా మిగిలిన ప్రమోషన్లను మార్చిలో ఇవ్వకుండా ఆలస్యం జరుగుతుందని వారు గుర్తింపు సంఘం పనితీరుపై విరుచుకుపడ్డారు. డిసెంబర్ నాటికి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను భర్తీ చేయాలని, ఖాళీలతో సంబంధం లేకుండా షాంప్లింగ్ మజ్దూర్ ప్రమోషన్లు కల్పించాలని అంతేకాకుండా శాంప్లింగ్ మజ్దూర్ ప్రమోషన్లలో శాంప్లింగ్ అసిస్టెంట్ కేటగిరి 2 ఇచ్చేలా క్యాడర్ స్కీమును సవరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిహెచ్పి ఎస్ఈ చంద్రమౌళికి అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్పి పిట్ సెక్రెటరీ అయిందాల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.