ఆర్టికల్ 370పై జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో కొనసాగుతున్న కుమ్ములాటలు
జమ్ముకశ్మీర్, నవంబర్ 8: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ ౩౭౦పై అధికార పార్టీ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై విపక్ష బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సభలో అధికార, విపక్షాలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తోపులాటలు, వాకౌట్లతో సభ కార్యకలాపాలు స్తంభించా యి. పీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీలో బ్యానర్‌తో హల్‌చల్ చేశారు. దాన్ని బీజేపీ నేతలు చించేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. అప్రమత్తమైన స్పీకర్.. బ్యానర్ పట్టుకున్న ఎమ్మెల్యేతో పాటు పోడియంలోకి దూసుకువచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకువెళ్లాలని మార్షల్స్‌ను ఆదేశించడంతో.. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు పంపించివేశారు.