calender_icon.png 20 September, 2024 | 5:24 PM

జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లికి తరలింపు

20-09-2024 02:45:27 PM

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌గా పేరొందిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఉప్పర్‌పల్లి కోర్టు శుక్రవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో జానీ మాస్టర్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. గోల్కొండ ఆస్పత్రిలో జానీ మాస్టర్‌కు వైద్య  పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఉప్పరిపల్లి కోర్టుకు తరలించారు. 

గోవాలో సైబరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) గురువారం అరెస్టు చేసింది. నేరం జరిగినప్పుడు మైనర్‌గా ఉన్న అతని మాజీ సహాయకురాలు లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన తర్వాత కొరియోగ్రాఫర్‌పై పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు. కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు, అత్యాచారం, బెదిరింపులకు పాల్పడ్డారని 21 ఏళ్ల యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీసులు తొలుత జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు.