calender_icon.png 24 October, 2024 | 3:59 PM

కొరియోగ్రాఫర్ జానీకి బెయిల్ మంజూరు

24-10-2024 01:50:06 PM

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. గత నెల రోజులుగా జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గత నెలలో బెంగళూరులో సైబరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఔట్ డోర్ షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించడంతో సైబరాబాద్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆమె నివాసం ఉంటున్న నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.