21-02-2025 07:31:23 PM
దొంగే దొంగ అన్నట్టుగా ఉంది పుట్ట మధు వ్యవహారం..
వందల ఎకరాల భూములు, కోట్లు సంపాదించి ఈ ప్రాంతాన్ని హత్యలకు అడ్డాగా మార్చిన పుట్ట మధు బహిరంగ చర్చకు సిద్ధమా..!
ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్ల బాలాజీ ప్రశ్నించారు..
మంథని (విజయక్రాంతి): దుద్దిళ్ల కుటుంబం జోలికి వస్తే ప్రజలే నీకు బుద్ధి చెబుతారు పుట్ట అని ముత్తారం మాజీ జడ్పీటీసీ. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీలు అన్నారు. ముత్తారం మండల కేంద్రంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుట్ట మధు వ్యవహారం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని, వందల ఎకరాల భూములు, కోట్లు సంపాదించి ఈ ప్రాంతాన్ని హత్యలకు అడ్డాగా మార్చిన పుట్ట మధు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
నీకు రాజకీయ బిక్ష పెట్టి ఎంపిటిసి, జెడ్పీటీసీ, ఎంపిపిగా రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దుద్దిళ్ల కుటుంబం కాదా... ఒకసారి ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా నువ్వు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తేలేక నీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన దంపతులను నడి రోడ్డు మీద అతికిరాతకంగా చంపి, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా భయపెట్టి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నా వ్యక్తి నువ్వు కాదా... నిరంతరం ప్రజల్లో ఉంటూ రాముడికి లక్ష్మణుడు గా ఏ ఆపద వచ్చినా ఆదుకుంటు నేనున్నాను అని భరోసా ఇస్తూ శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు రూ.56 వేల కుటుంబాలను పరామర్శించిన వ్యక్తి సోదరుడు శ్రీనుబాబు అన్నారు.
ఒకప్పుడు పోలీసులు, మావోయిస్టుల మధ్య శాంతి, అశాంతి ల మధ్య నలిగి ఎన్నో కుటుంబాలు ప్రాణా త్యాగాలు చేసి శాంతి ని నెలకోల్పితే అటువంటి ప్రాంతాన్ని రాజకీయ కక్షల పేరిట హత్యలకు అడ్డాగా మార్చి, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా భయపడే స్థితికి తీసుకువచ్చింది నువ్వు కదా... అని ప్రశ్నించారు. దుద్దిళ్ల కుటుంబం పేరు తలవనిదే నీకు ప్రొద్దు గడవదు అని మంథనిలో చిన్న పిల్లాడోని అడిగిన చెప్పుతారన్నారు. ఖబడ్దార్ పుట్ట మధు ఇంకో సారి శ్రీధర్ బాబు, శ్రీను బాబుల మీద అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రస్తకే లేదని సదానందం హెచ్చరించారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవెన సంపత్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, గ్రామ శాఖ అధ్యక్షుడు అనుము సమ్మయ్య నాయకులు మోహన్ రెడ్డి, లక్కం ప్రభాకర్, తాటిపాముల శంకర్, రాజు, కుమార్, తిరుపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.