calender_icon.png 25 February, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెల్లో ఫార్మర్ పురస్కారానికి చొప్పదండి రైతు ఎంపిక

20-02-2025 01:12:54 AM

కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఉత్తమ మావురం మల్లిఖార్జున్ రెడ్డి సాగులో అవలంభిస్తున్న ఆధునిక విధానాలను గుర్తించిన భారతీయ వ్యవసాయ పరిశోధన సం జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రతిష్మాత్మకమైన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫెల్లో ఫార్మర్ పురస్కారం ప్రదానం చేయనుంది.

ఈ నెల 22న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద మంత్రి నుంచి మల్లిఖార్జున్ రెడ్డి అందుకోనున్నారు. దేశం మొత్తంలో కేవలం ఆరుగురు రైతులు మాత్రమే ఫెల్లో ఫార్మర్ పురస్కారానికి ఎంపిక కాగా దక్షిణ భారతదేశు నుంచి రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున్ రెడ్డి ఒక్కరే ఎంపిక కావడం పట్ల జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా రైతు మల్లిఖార్జున్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు జాతీయ, రాష్ర్టస్థాయి అవార్డులు 31 స్వీకరించినట్లు తెలిపారు. ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడంతోపాటు సాగులో ఇతర రైతులకు మెలకువలు నేర్పించి అధిక దిగుబడులకు సాధించేలా కృషి చేస్తున్నానని తెలిపారు. అధికారులు ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.