calender_icon.png 30 April, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

25-04-2025 12:43:33 AM

ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటూ వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా గురువారం పొలస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో  మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ  కార్యక్రమం  ముఖ్యఅతిథిగా పాల్గొన్న  ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లకు ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాల జగిత్యాలను మార్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.

అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అవగాహనా సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి  విద్యార్థులతో కలిసి తిలకించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు, సి సి ఎస్  సి.ఐ  శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై సుదాకర్, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.