13-03-2025 02:01:37 AM
న్యాయమూర్తి యువరాజ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : జీవితంలో పైకే ఎదగాలంటే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని న్యాయమూర్తి యువరాజ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రీడాకా రుల సన్మాన సభకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో కష్టపడి చదివితే గమ్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. వైద్యురాలు ఆనంది భాయ్, ఐపీఎస్ కిరణ్ బేడీ, అంతరిక్ష యానంలో రాణి స్తున్న కల్పనా చావ్లా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు కొనసాగాలని అది మన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందన్నారు.
అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ మాట్లాడుతూ ఎంతోమంది మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు కష్టాలు పడడంతో పాటు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్ రావు ఆదేశాల మేరకు క్రీడలను ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెఫ్రి బోర్డు చైర్మన్ ,కో సునాకర్ అరవింద్, క్రీడా అధికారి బండమీనారెడ్డి, ప్రధానోపాధ్యాయులు జంగు, కో లు సాగర్ ,రవి ,తిరుమల్, సాయి, ఆఫీజ్ తదితరులు పాల్గొన్నారు.