calender_icon.png 4 April, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలస్ట్టిరాల్ సైలెంట్ కిల్లర్

05-07-2024 01:42:58 AM

తొలిసారి గైడ్‌లైన్స్ ప్రకటించిన భారత్

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో బీపీ, కొలస్టిరాల్ రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో సమస్యను అదుపులో ఉంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మొదటిసారి ప్రభుత్వం  గైడ్‌లైన్స్ ప్రకటించింది. 22 మంది వైద్య నిపుణులున్న కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. అధిక రక్తపోటుకంటే అధిక కొలస్టిరాల్ సమస్య ఉండటమే ప్రమాదకరమని పేర్కొన్నది. రక్తంలో అధికంగా కొవ్వు ఉండటాన్ని వైద్య పరిభాషలో డిస్లిపిడెమియా అని పిలుస్తారు. ఈ కొవ్వు కణాలను అదుపులో ఉంచుకోకపోతే గుండె సమస్యలతోపాటు ఒక్కోసారి గుండెపోటు కూడా వస్తుందని, ఇతర సమస్యలకు కూడా ఇది కారణమవుతున్నదని సీఎస్‌ఐ తెలిపింది. ఇది రక్తంలో 100 ఎంజీ/డీఎల్ (మిల్లీగ్రామ్స్ ఆఫ్ షుగర్ పర్ డెసిలీటర్) కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచించింది.