calender_icon.png 23 October, 2024 | 12:52 AM

చాక్లెట్ ఫేస్ మాస్క్!

29-08-2024 12:00:00 AM

చర్మం అందంగా, కాంతివంతంగా క నిపించాలంటే ఇంట్లోనే సహజ సిద్ధమై న చాక్లెట్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడటంలో సహాయపడతాయి. చాక్లెట్ మాస్క్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కోకో పౌడర్ ఈ పేస్ట్‌ను తయా రుచేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒ క చెంచా కోకో పౌడర్ తీసుకోవాలి. దాం ట్లో ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మూడు పదార్థాలను మెత్తగా పేస్టులా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మె డ, ముఖంపై అప్లు చేసి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 

కోకో పౌడర్ పౌడర్‌ః మొటిమలపై చాక్లెట్ ఫేస్ మాస్క్‌ను అప్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సహజ సిద్ధమైన కోకో పౌడర్‌లో అదే పరిమాణంలో కాఫీ పౌడర్‌ను కలపాలి. దాంట్లో పాలు లేదా కొబ్బరి నూనెను కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లు చేసి ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. 

చాక్లెట్ ఈ పేస్ట్ చేయడానికి రెండు చెంచాల కోకో పౌడర్, రెండు చెంచాల ఓట్ మీట్, ఒక చెంచా పాలు లే దా బాదం పాలు తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ తయారీకి ముందుగా  గిన్నెలో కోకో పౌడర్, ఓట్ మీల్‌ను పాలల్లో కలపాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ము ఖం మీద 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది.