calender_icon.png 22 April, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో చిట్యాల ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ..

22-04-2025 06:19:14 PM

విద్యార్థులు, లెక్చరర్లను అభినందించిన ప్రిన్సిపల్ శ్రీదేవి..

చిట్యాల (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాలలో చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Chityala Government Junior College) విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి.శ్రీదేవి తెలియజేశారు. ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000, ఎన్ సౌమ్య 924/1000, ఏ.నవ్య 900/1000, బైపిసి సెకండియర్ లో ఏం.శ్రీవాణి 900/1000, ఎన్.ప్రియాంక 880/1000, బి. అజయ్ 880/1000, సీఈసీ సెకండ్ ఇయర్ లో ఏ.శివ 608/1000, హెచ్ఈసీ సెకండ్ ఇయర్ లో పి చందు 632/1000,ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎన్ అంజలి 457/470, జి మానసి 446/470, ఏం అంజలి 432/470, ఏం శరణ్య 427/470, బైపిసి ఫస్ట్ ఇయర్ ఎం హర్షిత 405/440, ఏ వైష్ణవి 393/440, ఫస్ట్ ఇయర్ ఇ రాహుల్ 362/500, ఓ సమత 354/500 మార్కులు సాధించారని  తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, లెక్చరర్లను ఆమె అభినందించారు.