calender_icon.png 25 February, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవికి సన్మానం

25-02-2025 03:56:31 PM

చిట్యాల,(విజయక్రాంతి): జిల్లాలో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసినందుకుగాను చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్, మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవిని హైదరాబాద్ గాంధీభవన్ లో మంగళవారం ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని  పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.