09-03-2025 12:15:21 PM
చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్
చిట్యాల,(విజయక్రాంతి): ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించడం గొప్ప విషయమని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ స్లబ్ అధ్యక్షుడు కాట్రైవుల ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సీఐ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల వ్యాప్తంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయులు డాక్టర్లకు, మహిళ పోలీసులకు, అంగన్వాడి, ఆశ, గ్రామ పంచాయతీ సిబ్బందిని సుమారు 18 మంది మహిళలను శాలువాలతో సన్మానించి మెమొంటోలను అందజేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సిఐ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు.మహిళలను గౌరవించినప్పుడే సమాజంలో అసమానతలు పోయి సమానత్వం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు చింతల రమేష్, ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్, కోశాధికారి రంగాచారి, మహిళలు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.