calender_icon.png 5 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు పాటించాలి

22-01-2025 12:40:01 AM

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ట్రైన్ నిలిపి ఆందోళన

శేరిలింగంపల్లి, జనవరి 21 (విజయక్రాంతి): చిత్తాపూర్ నుండీ సికింద్రాబాద్ వైపు వెళ్లే చిత్తాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు సరైన టైమ్ టేబుల్ పాటించాలని ప్రయాణికులు మంగళవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ లో  ట్రైన్ నిలిపి ఆందోళనకు దిగారు.

ప్రతిరోజు ఉదయం 7:30గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ కు రావలసిన ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యంగా వస్తుందని ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని,ఇన్ టైమ్ లో ఆఫీసులకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు.ఖచ్చితమైన వేళలు పాటించి ట్రైన్ నడపాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేపట్టిన ప్రయాణికులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రైల్వే పోలీసు స్టేషన్ కు తరలించారు.ట్రైన్ సమయపాలన పాటించాలని ప్రయాణికులు రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు.