calender_icon.png 1 April, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రపురికాలనీ జనరల్ బాడీ సమావేశం

30-03-2025 12:34:09 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి ౨౯ (విజయక్రాం తి): చిత్రపురికాలనీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. కొత్త ఫైవ్ మెన్ అలాట్‌మెంట్ కమిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించి ఇద్దరిని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజ, సృజన, అనిల్ కాలనీలో జరుగుతున్న సంఘటనల గురించి సభ్యులకు వివరించారు.

అజెండా ప్రకారం కొత్త ప్రపోజల్స్ గురించి వీడియో రూపకంగా చూపించారు. సమా వేశానికి దాదాపు ౧౨౦౦ మంది హాజరవ్వగా, చిత్రపురి రక్షణ పేరుమీద కేసులు వేసిన వాళ్ళు, మీటింగ్ జరగకూడదని కేసులు వేసిన వాళ్లు మాత్రం ఈ సమావే శానికి హాజరుకాలేదు. 

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ వల్లభనేని, కార్యదర్శి పీఎస్‌ఎన్ దొర, ట్రెజరర్ లలిత, సభ్యులు మహానందరెడ్డి, కాదంబరి కిరణ్, కొంగర రామకృష్ణ ప్రసాద్, అలహరి వీవీ ప్రసాద్, దీప్తి వాజ్‌పేయి తదితరులు పాల్గొన్నారు.