calender_icon.png 14 November, 2024 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుమర్తికి సమన్లు ఫోన్ ట్యాపింగ్ కేసు..

12-11-2024 01:23:56 AM

  1. తొలిసారిగా రాజకీయ నాయకుడికి..
  2. జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణకు హాజరుకావాలని పిలుపు
  3. అనారోగ్య కారణాలతో లింగయ్య గైర్హాజరు
  4. 14న విచారణకు వస్తానని వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం.. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసు అధికారులను మాత్రమే విచారించిన పోలీసులు.. ప్రస్తుతం రాజకీయ నేతలను విచారణకు పిలుస్తున్నారు.

తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సమన్లు జారీచేశారు. సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ పీ వెంకటగిరి ఎదుట విచారణకు హాజరుకావా లంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీకావడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

తదుపరి నోటీసులు అందుకునేది ఎవరు? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. అయితే అనారోగ్య కారణంగా సోమవారం విచారణకు హాజరుకాలేనని, ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చిరుమర్తి లింగయ్య పోలీసులకు తెలిపినట్లు సమాచారం. 

ప్రత్యర్థులపై నిఘా..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏ5గా ఉన్న తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు జరిగాయని విచారణలో తేల్చారు. ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి, వారి కదలికలపై నిఘా ఉంచినట్లు నిర్ధారించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు ఫోన్ ట్యాపింగ్‌కు వాడిన డివై జ్‌ల డేటా సేకరణ.. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో ఇప్పటివరకు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఏ2గా ఎస్‌ఐబీ ఎస్వోటీ చీఫ్ ప్రణీత్‌రావు, ఏ3గా టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు,  ఏ4, ఏ5గా అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు ఏ6గా ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌లను చేర్చారు. విచారణ క్రమంలో అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావు, గట్టుమల్లు భూప తి అరెస్ట్ అయ్యారు.

ప్రస్తుతం ప్రభాకరరావు, శ్రవణ్ విదేశాల్లో ఉన్నారు. బీఆర్ ఎస్ అధినేత ఆదేశాల మేరకు వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికారపక్ష నాయకులు, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నా యి. ప్రణీత్ రావు అరెస్ట్‌తో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో విచారణ జరిపింది.

ఈ కేసును విచారించేకొద్ది కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమే యం ఉందని పోలీసులు నిర్ధారించారు. రేపో మాపో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు అందజేస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీచేశారు.