calender_icon.png 27 March, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టుకో... చిరుమర్తి రాజు

21-03-2025 02:44:02 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): సూర్యాపేటలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుంగతుర్తి మాజీ శాశన సభ్యులు గాదరి కిషోర్ కుమార్(Former Thungathurthi MLA Gadari Kishore Kumar) ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఉద్దేశించి నోటికీ వచ్చినట్లు బూతులు మాట్లాడిన కిషోర్ వెంటనే ముఖ్యమంత్రికి బేశరత్ గా క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజు డిమాండ్ చేశారు.

అధికారంలో కోల్పోయి ఏడాది గడిచిన అహంకారంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తుంగతుర్తి లో నిన్ను బొంద పెట్టిన ఇంకా సిగ్గులేదని హెద్దేవ చేశారు. మీ బలుపు వల్లనే మీ పార్టీనీ ప్రజలు  చిదరించుకున్నారని పేర్కొన్నారు. ఇంకోసారి మా ముఖ్యమంత్రి పైన పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం నాలుక చీరెస్తాం అని హెచ్చరించారు.మీ నాయకులకు మీకు పిచ్చి లేచి ఎం మాట్లాడుతున్నారో అర్ధం అవ్వటం లేదు అని వెంటనే పిచ్చి ఆసుపత్రి లో చేరాలని కోరారు.