22-02-2025 12:00:00 AM
ప్రముఖ నటీనటుల విషయంలో ఊహాగానాలు సర్వసాధారణం. కానీ కొన్ని సెన్సిటివ్ విషయాల్లోనూ దుష్ప్రచారానికి తెరదీస్తే ఆ కుటుంబానికి అంతకన్నా వేదన మరొకటి ఉం డదు. ప్రస్తుతం చిరంజీవి కుటుంబం కూడా ఇదే ఇబ్బందికర పరిస్థితిని అనుభవిస్తోంది. చిరంజీవి తల్లి అంజనమ్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ దుష్ప్రచారం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ఖండించారు.
తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదన్నారు. అంజనమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ విషయమై ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. “మా అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారంటూ మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. రెండు రోజులుగా ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె చాలా ఆరోగ్యంగా, ధైర్యంగా, క్షేమంగా ఉన్నారు. దయచేసి మీడియా ఆమె ఆరోగ్యం విషయమై ప్రచురిస్తున్న వార్తలను నిలిపివేయండి” అని చిరంజీవి పోస్ట్‌లో పేర్కొన్నారు.