calender_icon.png 16 January, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ సీఎంను కలిసిన చిరంజీవి

09-08-2024 12:05:00 AM

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తుపై స్పందిస్తూ తనవంతు బాధ్యతగా రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిశారు. తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి చిరంజీవి ప్రకటించిన ఆర్థిక సహాయం చెక్కును ఆయన ఈ సందర్భంగా కేరళ సీఎంకు అందించారు. కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు.