calender_icon.png 7 October, 2024 | 6:48 AM

చిరంజీవి చేతికి గాయం

07-10-2024 12:06:46 AM

మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారారు. తాజాగా రాజేంద్రప్రసాద్ కుమార్తె మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పరామర్శించేందుకు చిరు తన సతీమణి సురేఖతో కలిసి వెళ్లారు. అయితే చిరు కారు దిగుతున్న సమయంలో ఆయన చేతికి కట్టు ఉండటాన్ని అక్కడి వారితో పాటు మీడియాలో చూస్తున్న వారంతా గమనించారు.

దీంతో అసలు చిరు చేతికి ఏమైందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరు పోరాట సన్నివేశాలకు పెట్టింది పేరు. అలాంటిది ఏనాడూ ఆయన ఫలానా సినిమా చిత్రీకరణలో గాయపడ్డారంటూ పెద్దగా వార్తలు వచ్చింది లేదు. 

ప్రస్తుతం కూడా అలాంటి వార్తలు ఏమీ వినిపించలేదు. కానీ చిరు గాయంతో కనిపించడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిరు ఎడమ చేతికి కట్టు ఉన్న వీడియో బాగా వైరల్ అవుతోంది. అయితే ఆయనకు గాయం ఎలా అయ్యిందన్నది మాత్రం తెలియరాలేదు.

ఏమైనా సినిమా చిత్రీకరణలో గాయపడ్డారా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం చిరు విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చిరు విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిర్రీకరణలో ఏమైనా గాయం అయ్యిందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ చిత్ర యూనిట్ మాత్రం దీనిపై స్పందించలేదు.