calender_icon.png 28 September, 2024 | 12:53 PM

చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు.. సందడి చేసిన బాలయ్య, వెంకీ

28-09-2024 10:47:56 AM

అబుదాబి: అబుదాబిలోని ఐకానిక్ ఎతిహాద్ ఎరీనాలో జరిగిన 24వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డ్స్-2024 వేడుక జరిగింది. టాలీవుడ్ లెజెండ్ మెగా స్టార్ చిరంజీవికి "భారత చలనచిత్ర రంగానికి అత్యుత్తమ అచీవ్‌మెంట్" అవార్డుతో సత్కరించారు. చలనచిత్ర పరిశ్రమకు తన అసాధారణ సేవలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు, బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ, జావేద్ అక్తర్ ఈ అవార్డును చిరంజీవికి అందజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ అవార్డు కేవలం నా కృషికి మాత్రమే కాదు, నా ప్రయాణంలో తెలుగు చిత్ర పరిశ్రమ, నా అభిమానుల నుండి నాకు లభించిన ప్రేమ, మద్దతుకు నిదర్శనం. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చిరు పేర్కొన్నారు.

టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, తేజ సజ్జా హోస్ట్ చేసిన స్టార్-స్టడెడ్ నైట్, భారతీయ సినిమా పరిశ్రమలోని ప్రముఖులను ఒకచోటకు చేర్చింది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ సందడి చేయగా, నాజర్, బ్రహ్మానందం, ప్రియదర్శన్, ప్రియమణి, జయరామన్, శరత్‌కుమార్, రాధిక, వరలక్ష్మి శరత్‌కుమార్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.