calender_icon.png 7 February, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవి మృతి బాధాకరం

07-02-2025 12:00:00 AM

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

కోదాడ ఫిబ్రవరి6: మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పిడమర్తి చిరంజీవి మరణం బాధాకరమని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. చిరంజీవి  కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు.

చిరంజీవి అంత్యక్రియలలో స్వేరో వ్యవస్థాపక అధ్యక్షులు,బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని చిరంజీవి భౌతిక దేహం పై పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి సంతాపాన్ని తెలిపారు.

అంత్యక్రియలలో ప్రత్యేకంగా పాల్గొని ఇద్దరు నాయకులు చిరంజీవి పడెను మోసి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు భార్య, సంధ్య, అన్నలు బల్గూరి కాశయ్య, మైసయ్య, దుర్గయ్య  పిడమర్తి వెంకటేశ్వర్లు, మాతంగి ప్రభాకర్ రావు, స్వేరోస్ రాష్ట్ర నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.