calender_icon.png 11 January, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక విద్యార్థినిలు

18-09-2024 03:22:06 PM

సిద్దిపేట (విజయక్రాంతి):  సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో  జరిగిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో  చింతమడక జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దుంపటి రుక్మిత అండర్ -1480 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం,  జెళ్ళ అవంతిక 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి  ఈ నెల 19 నుంచి 29 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు కొత్త రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను, ఫిజికల్ డైరెక్టర్ ను వెంకటస్వామి ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు బాలరాజ్, అజిజ్, సత్తయ్య, రాందాస్, రాజు, రామ్ రెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, రేణుక,  పోచయ్య, శ్రీశైలం, కృష్ణ మని, హరికృష్ణ, కిషోర్ తదితరులు అభినందించారు.