calender_icon.png 1 November, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్దీవులకు మళ్లీ చైనా నౌక

28-04-2024 02:30:20 AM

ముయిజ్జు ఎన్నికైన కొద్దిరోజులకే రాక

కొన్నేళ్లుగా భారత్ చుట్టూ డ్రాగన్ నౌకల చక్కర్లు

అభ్యంతరం వ్యక్తం చేస్త్తున్న ఇండియా

మాలే (మాల్దీవులు), ఏప్రిల్ 27: మాల్దీవుల్లో రెండు నెలల క్రితం వారం పాటు తిష్ట వేసిన చైనా పరిశోధన నౌక తిరిగి మళ్లీ ద్వీపదేశానికి చేరుకుంది. ఈ విషయంలో గతం లోనూ భారత్ ఆందోళనలు వ్యక్తం చేసింది. అయితే, ఈ నౌక మళ్లీ రావడానికి గల కారణాలను మాల్దీవుల ప్రభుత్వం వెల్లడించ లేదు. అనుమతులు మాత్రం మంజూరు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. థిలాఫుషీ ఇండస్ట్రీయల్ దీవుల్లోని హార్బర్‌కు జియాంగ్ యాంగ్‌హాంగ్ గురు వారం చేరుకుంది. చైనాకు మద్దతుదారైన మహ్మద్ ముయి జ్జు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ పరిణామం జరగడం గమనా ర్హం. ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి.  

కొన్నేళ్లుగా ఇదే తంతు.. 

మాల్దీవులు, శ్రీలంక మధ్య చైనా నౌకలు చక్కర్లు కొట్టడం భారత్‌కు ఆందోళనకరమైన విషయం. హిందూ మహాసముద్రంపై పట్టు పెంచుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలుగా భారత్ ఈ చర్యలను వ్యతిరేకిస్తోంది. 2022 నుంచి చైనాకు చెందిన పరిశోధన నౌకలు శ్రీలంక జలాల పరిధిలో తిష్ట వేస్తున్నాయి. వీటిని భారత్ తీవ్రంగా వ్యతిరేకి స్తోంది. గతేడాది ఆగస్టులో కొలొంబో పోర్టుకు చైనా నిఘా యుద్ధనౌక రావడంపై ఇండియా తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపింది. 2019, 2021లోనూ చైనా తన కీలక నిఘా నౌకలనూ పంపింది. 

చైనా సమర్థన..

భారత్‌కు సమీపంలో యుద్ధ, నిఘా నౌక లు పంపడంపై చైనా సమర్థించుకుంది. జనవరిలో ఆ దేశ విదేశాంగ ప్రతినిధి  మాట్లా డుతూ.. సముద్ర జలాల్లో శాంతి, మానవ తా దృక్పథంతోనే శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. మాల్దీవుల ప్రాదేశిక జలాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి పరిశోధనలు చేపట్టబోమని స్పష్టంచేశారు. మాల్దీవులు భారత్‌కు 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. అంతేకాకుండా వాణి జ్యపరంగా కీలకమైన ప్రాంతంలో మాల్దీవు లు ఉన్నాయి. ఇది భారత్‌కు వాణిజ్యంతోపాటు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది.