calender_icon.png 25 October, 2024 | 3:54 AM

టెర్రరిస్టులకు చైనా పరికరాలు

09-07-2024 02:34:30 AM

  1. వారంతా ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారే
  2. పాక్ ఆర్మీకి మేడ్ ఇన్ చైనా టెలికాం పరికరం
  3. టెర్రరిస్టులకు కూడా అదే సప్లు

న్యూఢిల్లీ, జూలై 8: ఇండియాలో నరమేధం సృష్టిస్తున్న టెర్రరిస్టుల కోసం ‘అల్ట్రాసెట్’ అనే అధునాతన టెలికాం హ్యాండ్‌సెట్‌ను తయారు చేసి అందిస్తోంది. పాక్ ఆర్మీ కూడా ఇదే పరికరాన్ని వాడుతుండడం గమనార్హం. పాక్ ఆర్మీ వాడే ఈ టెలికాం పరికరాలు జమ్మూలో ఉంటున్న టెర్రరిస్టుల చేతికి చేరినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో పోయిన సంవత్సరం జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత, అలాగే మొన్న ఏప్రిల్‌లో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత ఈ అధునాతన టెలికాం పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 

అసలేంటీ ‘అల్ట్రాసెట్’

అల్ట్రాసెట్ అనేది అధునాతన టెక్నాలజీతో పని చేసే చైనా టెలికాం పరికరం. వీటిని ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులు వాడుతున్నారు. ఈ ప్రత్యేక పరికరాలను చైనా కంపెనీలు స్పెషల్‌గా పాక్ ఆర్మీ కోసం తయారు చేస్తుంటాయి. ఈ అల్ట్రాసెట్ హ్యాండ్ సెట్స్ అచ్చం సెల్‌ఫోన్ మాదిరి ఉంటాయి. వీటిల్లో రేడియో పరికరాలు కూడా ఉంటాయి. మెస్సేజులు పంపేందుకు, రిసీవ్ చేసుకునేందుకు రేడియో తరంగాలు ఉపయోగపడతాయి. ప్రతి అల్ట్రాసెట్ బార్డర్‌లో ఉన్న కంట్రోల్ స్టేషన్‌కు అనుసంధానించబడి ఉంటుంది. 

చైనా శాటిలైట్లతో.. 

ఈ మెస్సేజులను చేరవేసేందుకు చైనా శాటిలైట్లు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మెస్సేజులు బైట్స్ రూపం లో క్రోడీకరించబడి మొదటగా పాక్‌లో ఉన్న మాస్టర్ సర్వర్ ద్వారా నిర్దేశిత డివైజ్‌కు చేరుకుంటాయని వారు పేర్కొన్నా రు. చాలా రోజుల నుంచి పాక్ సైన్యం కోసం చైనా ఈ పరికరాలను తయారు చేస్తోంది. కేవలం వీటిని అందించడమే కాకుండా చైనా ప్రభుత్వం నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీకి బంకర్లు, చాలా రకాల వాయు పరికరాలు, అధునాతన టెక్నాలజీ మొదలయినవి అందించుకుంటూ వస్తోంది.