13-02-2025 01:20:12 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: భారత్‌లో నిషేధానికి గురైన చైనా యాప్స్ ఐదేళ్ల తర్వాత మళ్లీ దర్శనమిస్తున్నాయి. భారత్ బహిష్కరించిన వాటి లో 36 యాప్స్ కొత్త పేరుతో భారత యూజ ర్లు వాడే ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యమవుతుండడం గమనార్హం. 2020లో గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం భద్రతా కారణాల రిత్యా చైనాకు చెందిన 200కు పైగా యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది.
వీటిలో గ్జిండర్ (ఫైల్ షేరింగ్), మ్యాంగో టీవీ (ఎంటర్‌టైన్‌మెంట్), టావో బావో (ఆన్‌లైన్), టాన్ టాన్ (డేటింగ్ యాప్), తదితర అప్లికేషన్లు తాజాగా పేర్లు మార్చుకొని గూగుల్ , యాపిల్ ప్లే స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ నిషేధిత చైనా యాప్‌లు భారత్‌లో ప్రవేశించడానికి వేర్వేరు మార్గాలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు రిటైల్ మార్కెటింగ్ యాప్ షీన్..
రిలయన్స్ లైసెన్స్‌తో ఒప్పందం ద్వారా భారత్‌కు తిరిగి వచ్చింది. గల్వాన్ ఘర్షణ అనంతరం టిక్ టాక్, పబ్ జీ గేమ్స్ కూడా నిషేధించారు. 2021లో బాటిల్ గ్రౌండ్స్ పేరుతో పబ్ జీ మళ్లీ వినియోగంలోకి వచ్చింది.