calender_icon.png 21 September, 2024 | 4:35 PM

చైనాయే లక్ష్యంగా జొరావర్

15-09-2024 12:00:00 AM

  1. లైట్ వెయిట్ యుద్ధ ట్యాంక్‌ను రూపొందించిన భారత్ 
  2. పర్వత ప్రాంతాల్లో పోరాడేందుకు అనుకూలం 
  3. హెలికాప్టర్‌తోనూ వీటిని తరలించే అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: తూర్పు లఢక్‌లో చైనాతో ప్రతిష్టంభన ఎదుర్కొన్న భారత్ కొత్త పాఠాలు నేర్చుకుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ంలో పరిణామాలను గమనిస్తూ మన సైనిక వ్యవస్థలో లోపాలను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. డీఆర్‌డీవో దేశంలో మొట్టమొదటి తేలికపాటి పర్వత ట్యాంక్ జొరావర్‌ను అభివృద్ధి చేసింది. ఈ యుద్ధ ట్యాంక్‌కు శుక్రవారం విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించింది. 25 టన్నుల బరువు ఉండే ఈ ట్యాంకును వాయు మార్గంలోనూ ఇతర తరలించవచ్చు. ఎత్తున ప్రదేశాల్లో పోరాటానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. చైనాతో తలపడితే భారత సైన్యం అవసరాలు తీర్చే విధంగా జొరావర్‌ను రూపొందించారు. 

కీలక మైలురాయి

ఎడారి భూభాగంలో నిర్వహించిన క్షేత్రస్థాయి పరీక్షల్లోనూ జొరావర్ అసాధారణ పనితీరును కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు. నిర్దేశించిన అన్ని లక్ష్యాలను జొరావర్ సమర్థంగా చేరుకుందని చెప్పారు. ఈ ప్రయో గం ముఖ్యమైన రక్షణ వ్యవస్థలు, సాంకేతికతల్లో స్వావలంబన దిశగా భారత్ కీలక మైలురాయిని చేరుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభివర్ణించారు.

ఎల్&టీతో కలిసి ఈ ట్యాంక్ నిర్మాణాన్ని డీఆర్‌డీవో చేపట్టింది. మొత్తం 350 జొరావర్ ట్యాంకులను పర్వత ప్రాంతాల్లో మోహరించాలని సైన్యం నిర్ణయించింది. గతంలో డీఆర్‌డీవో దేశీయ సాంకేతి కతో మూడోతరం అర్జున్ ట్యాంకులను రూపొ ందించింది. ఈ ట్యాంకులు 58 టన్నుల బరువు ఉంటాయి. చైనాతో ఘర్షణల నేపథ్యంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులపై భారత్ దృష్టి సారించి జొరావర్‌ను రూపొందించింది.

ప్రత్యేకతలు ఇవీ..

జొరావర్‌ను కేవలం 3 ఏళ్ల వ్యవధిలో అభివృద్ధి చేశారు. జొరావర్ అంటే పంజాబీలో ధైర్యవంతుడని అర్థం. మరో మూడేళ్లలో ఈ ట్యాంకులు సైన్యానికి భారత ప్రభుత్వం అందించనుంది. జమ్ము డోగ్రా వంశానికి చెందిన రాజా గులాబ్‌సింగ్ అధీనంలో పనిచేసిన మాజీ సైనికాధికారి జనరల్ జొరావర్‌సింగ్ కహ్లూరియా పేరు మీద ఈ ట్యాంకుకు నామకరణం చేశారు. తేలికగా ఉండటం వల్ల సరిహద్దులకు వీటిని హెలికాప్టర్‌తో తరలించవచ్చు. ఉత్తరాన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎడారుల్లోనూ ఇవి సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ట్యాంకుల కు బలమైన కవచం ఉండటం వల్ల నీటిలోనూ పనిచేయగలదు. రోడ్డు మార్గంలో గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీనిపై మెషీన్ గన్స్ అమర్చవచ్చు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్లుళ్లను ప్రయోగించవచ్చు. ఒకే సమయంలో వివిధ దిశల్లో కాల్పులు జరపవచ్చు. భారత సైన్యం భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగేలా జొరావర్‌ను డీఆర్‌డీవో రూపొందించింది.