ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడాన్ని చైనా ఒక బ్రహ్మ విద్యలా సాధన చేసినట్లు కనిపిస్తోంది. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను వ్యూహాత్మకంగా కట్టడి చేయడానికి చైనా పథకం వేసింది . బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుక నిర్మించడానికి షీ జిన్ పింగ్ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ డ్యామ్ విషయంలో ఇన్నేళ్లు స్తబ్దుగా ఉన్న చైనా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం . ఈ మేరకు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఓ నివేదిక విడుదల చేసింది. దీని వల్ల భారత్‌కు భవిష్యత్ లో పెను ప్రమాదం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.