28-03-2025 12:00:00 AM
స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కొహెడలో నిర్మించబోయే మార్కెట్ చర్చ
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 27: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి. గురువారం సాయంత్రం అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగా రెడ్డితో కలసి కొహెడలో నిర్మించబోయే నూతన మార్కెట్ పై చర్చించి నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ సంబంధిత ఉన్నత అధికారులతో చర్చించి కొహెడ మార్కెట్ కు సంబంధించిన పరిపాలన అనుమతులు వేగవంతం చేయాలని అధికారు లను ఆదేశించినట్లు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం ఏర్పాటు.. కొహెడలో ఏర్పాటు చేయబోయే సమీకృత మార్కెట్ దేశం లోనే ఆదర్శంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, సీఎం ఓఎస్డీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.