calender_icon.png 31 October, 2024 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలాన్ల పేరిట చిల్లు

19-07-2024 12:05:00 AM

రూటు మార్చిన కేటుగాళ్లు

కొత్త పంథాలో హ్యాకింగ్ దందా

బెంగళూరు, జూలై 1౮: హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయింది.. మీ పాన్ డిటేల్స్, కేవైసీ అప్‌డేట్ చేయాలని లింకులు పంపి అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు రూటు మార్చి ట్రాఫిక్ చలాన్లంటూ మెస్సేజులు, లింకులు పంపుతూ బురిడీ కొట్టిస్తు న్నారు. వ్రోంబా ఫ్యామిలీకి చెందిన మాల్‌వేర్‌ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గుర్తించి నట్లు నిపుణులు తెలిపారు. ఇలా చేస్తూ చాలా మందిని బురిడీ కొట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. బ్యాంకు మోసాల గురించి ప్రజల్లో అధికారులు అవగాహన తెచ్చేందుకు చాలా కష్టాలు పడ్డారు. దీంతో కేటుగాళ్లు రూటు మార్చి ఇలా ట్రాఫిక్ చలాన్లంటూ మోసాలు చేయడం మొదలుపెట్టారు. 

వియత్నమీస్ హ్యాకర్ల పనే.. 

ఇలా ట్రాఫిక్ ఈ చలాన్లంటూ రెచ్చిపోతున్నది, అమాయకులను బురిడీలు కొట్టిస్తు న్నది వియత్నమీస్ హ్యాకర్లేనట. ఈ చెల్లింపులకు ఏవో యాప్స్ అని చెబుతూ లింకులు పంపుతున్నారు. పొరపాటున ఆ లింకులను క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇలా బురిడీ కొట్టిస్తున్నరు.. 

స్కామర్లు మన చేతి వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారు. ఈ అంటూ ఫేక్ మెస్సేజులతో పాటు పాటు లింక్స్ షేర్ చేస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే మాల్వేర్‌తో ఉన్న యాప్ మన ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది. మన ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం ఈ యాప్ తస్కరించి కేటుగాళ్లకు చేరవేస్తుంది. ఇటువంటి మెస్సేజులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మనం ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే పలు రకాల పర్మిషన్ల కోసం మన అనుమతి అడుగుతుంది. అవేమీ పట్టించుకోకుండా మనం ‘ఎస్’ క్లిక్ చేస్తాం. ఇలా చేయడం వల్లే ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.