13-04-2025 05:08:42 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): వేసవి కాలంలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో రామాలయం చౌరస్తా కాంగ్రెస్ యువ నాయకులు గంపల వీరస్వామి తండ్రి కీ.శే గంపల రాజనర్సు పేరు మీదగా ఆదివారం చలివేంద్ర ఏర్పాటు చేసి మజ్జిగ, అంబలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు గాండ్ల సమ్మయ్య మాట్లాడుతూ... వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన గంపల వీరస్వామి కుటుంబ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి మహంకాళి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్, ఆశావేని సత్యనారాయణ, మేకల కుమారస్వామి, కనుకుంట్ల కుమార్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.