12-02-2025 12:29:36 AM
సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మిర్చి ధరల క్షీణతపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. తెగుళ్ల తీవ్రత, గణనీయంగా పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో క్వింటాకు కనీసం రూ.25వేలు చెల్లిస్తేనే రైతులకు కొంతమేరకైనా గిట్టుబాటు అవుతుందన్నా రు. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ రూ.23వేలు ధర ఉందని గుర్తు చేశారు.
ఈ విషయంలో కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు చొర వ చూపి మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొను గోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చ రించారు. ఖమ్మంలోని సుందరయ్య భవ నంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి నున్నా నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఖమ్మం మార్కెట్‌కు సోమవారం ఒక్కరోజే లక్ష బస్తాలకు పైగా మిర్చి అమ్మకానికి వచ్చిందన్నారు. జెండా పాట రూ.14వేల కు పైగా పలికినా అధిక భాగం మిర్చిని క్వింటాల్ రూ.13వేలలోపు ధరకే కొనుగో లు చేశారని తెలిపారు. జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులు నష్టపోకుండా చూడాలని, మద్దతు ధర చెల్లించాలని ఆదేశాలిచ్చినా ఉపయోగం లేదన్నారు.
మిర్చి బోర్డు ఏర్పాటుకు డిమాండ్..
కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు ముందుకొచ్చి మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేస్తే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ప్రయివేటు వ్యాపారులు సైతం మంచి రేటు పెడతారని చెప్పారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో రైతులు ఆందోళనల తో మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు జరిపిన సంద ర్భాలు ఉన్నాయన్నారు. పార్టీ జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.