- జల్‌పల్లిలోని తన ఆస్తులు ఇప్పించాలని రంగారెడ్డి కలెక్టర్‌ను కోరిన సినీ నటుడు మోహన్‌బాబు
- కలెక్టరేట్‌లో విచారణకు హాజరైన మంచు మనోజ్
మహేశ్వరం, జనవరి 18: గత కొన్ని రోజులుగా సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తుల పంచాయితీ ఇప్పుడే చల్లారేలా లేదు. తాజాగా మోహన్‌బాబు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు ఇప్పించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయడంతో మరోసారి మంచు ఫ్యామిలీ గొడవలు హాట్‌టాపిక్‌గా మారా మోహన్‌బాబు మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన ఫిర్యాదులో జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా అక్రమించుకున్నారని ఆరోపించారు.
దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జల్‌పల్లి నివాసంలో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసులు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాలకు స్పందించిన మంచు మనోజ్, ఆయన లీగల్ టీం శనివారం కొంగరకలాన్‌లోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ ముందు హాజరయ్యారు.
అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ అడిగిన పలు ప్రశ్నాలకు మనోజ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తదనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ..ఆస్తుల తగదాలు ఏమీ లేవని నా కుటుంబం, నా బంధువుల కోసమే పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మనోజ్ స్పష్టం చేశారు.