10-04-2025 11:23:17 PM
చిలుకూరు: చిలుకూరుకు చెందిన సంక్రాంతి విజయ శేఖర్ శిరీష ల కూతురు 'శాస్త్రాణి' భగవద్గీత పారాయణ పరీక్షలో పతకం సాధించింది. ప్రతి ఏటా మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో పతాకం గెలుచుకుంది. కాగా నేడు హైదరాబాద్ లోని దిండిగల్ లో గల దత్త ఆశ్రమంలో శ్రీ సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తో పాటు సర్టిఫికెట్ ను అందుకున్నారు.