calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల హక్కులను రక్షించాలి

17-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి):బాలల హక్కులను రక్షించాలని జిల్లా బాలల సంరక్షణ  విభాగం సోషల్ వర్కర్ డోంగ్రి  ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో పంచాయితీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శాంతిలాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కమిటీ  సమావేశంలో బాలల హక్కులు, బాల్య వివాహా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరీష్, మాజీ సర్పంచ్ దత్తు, మాజీ ఎంపీటీసీ రవీందర్, శేషాద్రి, పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు మూర్తి, సంగీత, విజ య లక్ష్మి, పెంటు బాయి, పద్మ ఉన్నారు.