calender_icon.png 26 February, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుమ్ముగూడెంలో బాలమేళా

18-02-2025 12:00:00 AM

భద్రాచలం ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) ః సోమవారం నాడు దుమ్ముగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ పరిధిలోని 26 పాఠ శాలల పరిధిలో దుమ్ముగూడెం కాంప్లెక్స్ స్థాయి బాలమేళ ఘనంగా ప్రారంభమైనది.

ఈ బాలమేళ ను మండల అధికారులు మండల అభివృద్ధి అధికారి బి. రామకృష్ణ, మండల విద్యాధికారి సున్నం సమ్మయ్య, నరసాపురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు లు బెక్కంటి శ్రీనివాసరావు  సమక్షంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ ఏవిరామారావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బాలమేళ  ను ప్రారంభించారు.

ప్రాథమిక స్థాయిలో తెలు గు ఇంగ్లీష్ గణితం విషయాల్లో తరగతి గదిలో సాధించిన కనీస అభ్యసనా సామ ర్ధ్యాలను అధికారులు ముందు విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వుల మేరకు ప్రతిభ కనబరిచిన క్లస్టర్ పరిధిలోని ఉత్తమ పాఠశా లగా. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెరువు గుంపును ఎంపిక చేసి అవార్డు ప్రధానం చేశారు