హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బాలల దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యమంలో మంత్రులు పొన్నం ప్రభాకార్, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మహనీయుడికి నివాళులు అర్పించారు. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు అందజేశారు.