24-03-2025 03:37:54 PM
చిట్యాల,(విజయక్రాంతి): మండలకేంద్రంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు నిర్వహించగా, జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఉషా కంపెనీ అసిస్టెంట్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ వెంకట్(Usha Company Assistant Sales Administration Head Venkat) పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల నుండి అందుతున్న పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడి సెంటర్లో ఆట పాటల విద్యతో విద్యార్థుల భవితవ్యాన్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేస్తున్నటువంటి కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆరోగ్య కమిటీ సభ్యులు, అంగన్వాడి టీచర్ సంధ్యారాణి, ఆయా లావణ్య, తదితరులు పాల్గొన్నారు.