calender_icon.png 20 April, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

10-04-2025 12:21:35 AM

చేవెళ్ల, ఏప్రిల్ 9 : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని దామరగిద్ద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు సకల సౌకర్యాలు (వసతులు) ఉన్నాయని అన్నారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, దాతల సహకారంతో పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.