05-04-2025 12:00:00 AM
కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూర్,ఏప్రిల్04(విజయక్రాంతి): ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అంగ న్వాడి కేంద్రాలలో చదువుతోపాటు ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారని అన్నారు.
నూతన సిలబస్ తో, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీల్లో బోధిస్తున్నామని అన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీల్లో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. పిల్లలం దరిని అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పర్లపెల్లి గ్రామంలోని మహిళలందరూ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. ఇదివరకే ఈ గ్రామంలో రెండు సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వచ్చే నెలలో మరోసారి క్యాంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జిల్లా సంక్షేమ అధికారి సబిత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, సిడిపిఓ శ్రీమతి పాల్గొన్నారు.