25-02-2025 04:39:33 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి నగరంలో అక్రమంగా అమ్మతున్నారు.
దీంతో మాల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు రంగంలో దిగి నలుగురు చిన్నారులను రక్షించి, 11 మంది నిందితులను చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. నిందితులు కోలా కృష్ణవేణి, దీప్తి, గౌతం, సావిత్రి దేవి, శ్రవణ్ కుమార్, శారదా, సంపత్ కుమార్, ఆమ్ గోత్ గా గుర్తించారు. చిన్నారులను కొనుగోలు చేసిన నాగవెంకట పవన్ భగవాన్, రమా శ్రావణి, వినయ్ కుమార్, స్వాతి, రమేశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 11 ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.