* గురుకుల విద్యార్థినులతో మంత్రి పొన్నం డిన్నర్
హుస్నాబాద్, డిసెంబర్ 24: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి మంగళవారం బాలికలతో కలిసి డిన్నర్ చేశారు. స్టూడెంట్స్‌తో పాటు వరుసలో నిలబడి ప్లేట్‌లో అన్నం పెట్టుకున్నారు. అనంతరం వారికి లైఫ్ స్టోరీస్ చెప్పి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో మోటివేట్ చేశారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు.
పనుల్లో వేగం పెంచండి..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులను పొన్నం పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పనులను స్పీడప్ చేసి ఈనెల 31లోగా పూర్తిచేయాలన్నారు. బస్టాండ్ ప్రాంగణ రోడ్ల అభివృద్ధి పనుల్లో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.అనంతరం బస్టాండ్ ఆవరణలో రోడ్డు వైడెనింగ్‌తో షాపులు కోల్పోతున్నవారితో మాట్లాడి నష్టం జరగకుండా పనులు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.