21-04-2025 10:33:22 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): పిల్లలకు తల్లిదండ్రులు పోషకాహారం అందించాలని సూపర్ వైజర్ రమాదేవి అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ 3, గౌతమి నగర్ అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం పోషణ పక్వాడా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చిరుధాన్యాలతో అనుబంధ పోషక ఆహారం, పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎన్ పద్మ, శారద, పద్మావతి, జయ, ఏఎన్ఎంలు నాగలక్ష్మి, రాజేశ్వరి, ఆర్పీ అమీనా, తదితరులు పాల్గొన్నారు.